
కోడె ఎద్దును చంపిన పెద్దపులి
కొత్తపల్లి యువతరం విలేఖరి;
పెద్దపులి సంచారంతో మండలంలోని గిరిజన గ్రామాలైన బలపాల తిప్ప, జానా లగూడెం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున బలపాలతిప్ప గ్రామానికి చెందిన పశులనారయణ ఇంటి ఆవరణంలో కట్టేసిన కోడె ఎద్దు పై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో అందరం ఇంట్లో నిద్రించామని లేదంటే ఇంటి ఆవరణంలో నిద్రించేవారిమని పెద్దపులి మనుషుల పై దాడిచేసేదెమో అని పశులనారయణకుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం చుట్టూ పారం చెట్లు పెరగడంతో పెద్దపులి జనావసంలోకి వచ్చిందని, పారం చెట్లు తొలిగించి మాకు రక్షణకల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతి చెందిన కోడెదూడను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొత్తపల్లి పశువైద్యాధికారి భవనేశ్వరి మృతి చెందిన కోడెదూడకు శవపరీక్ష నిర్వహించారు. పెద్దపులి దాడితోనే కోడెదూడ మృతి చెందిదని ఆమె తెలిపారు. మృతి చెందిన కోడెదూడను మంటల్లో కాల్చి ఖననం చేశారు.