
యోగా నడక ఆరోగ్యానికి మంచి ఔషధం… డాక్టర్ రుద్రరాజు సాయి శిల్ప
(అమలాపురం సాయి సంజీవిని వాకర్స్ యోగ ఆరోగ్య సేవా సంస్థ నెలవారి ఆరోగ్య సదస్సులో యోగా నడక ఆరోగ్యం అంశంపై సదస్సు)
అమలాపురం యువతరం ప్రతినిధి;
రోజూ 7500 అడుగులు నడవాలని కనీసం రోజూ30 నిమిషాలు చొప్పున వారానికి ఐదు రోజులు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, వ్యాయామం వల్ల శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయని అమలాపురం సాయి సంజీవిని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రుద్రరాజు సాయి శిల్ప అన్నారు. ఆదివారం అమలాపురం సాయి సంజీవిని వాకర్స్ యోగ ఆరోగ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కూచిమంచి వారి అగ్రహారంలోని సాయి సంజీవిని ఆసుపత్రిలో జరిగిన నెలవారి ఆరోగ్య సదస్సులో ఆమె “యోగ నడక ఆరోగ్యం ‘”అంశంపై ప్రసంగించారు. నడక శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని పెంచడానికి రక్తంలోని చక్కెర కండరాలు గ్రహించేందుకు సహకరిస్తాయని దానివల్ల చక్కర వ్యాధి వచ్చే అవకాశాలను నడక తగ్గిస్తుందని ఆమె అన్నారు. యోగ శరీరం మనసు రెండింటిని లయంచేసి శరీరానికి తగినట్లు మనసు ను
స్పందింప చేస్తుందని దీనివల్ల మనిషి ఆరోగ్యంగా శక్తిమంతుడిగా తయారవుతాడని డాక్టర్ సాయి శిల్పఅన్నారు. ఆరోగ్య సదస్సుకు ఆరోగ్య సంస్థ అధ్యక్షులు ,మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నాని రాజు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు ఆరోగ్య సదస్సులు ప్రతినెలా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
నడకను దినచర్యగా పాటించాలని మానసిక ఒత్తిడిని ,ఆందోళన, మనోభావాల అస్థిరతను నడక తగ్గిస్తుందని, అలసటను, విసుగును, నిద్రలేమిని నివారిస్తుందని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని డాక్టర్ వై.టి.బి వెంకటేష్ అన్నారు. అంతర్జాతీయ వాకర్స్ ఏరియా వన్ కోఆర్డినేటర్ తేతల సత్యనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి అంతర్జాతీయ వాకర్స సంస్థ నుండి ప్రతి ఒక్క సభ్యుడుగాగుర్తింపు కార్డు పొందాలని , దీనివల్ల ఎన్నో ప్రయోజనం ఉన్నాయని ఆయన చెప్పారు. కార్యదర్శి నల్లా నరసింహమూర్తి తొలుత వాకర్స్ ప్రార్ధన ఆలపించారు. సదస్సులో డాక్టర్ సి.హెచ్ .పవన్ కుమార్, గుర్రం రామకృష్ణారావు, విశ్రాంత భవిష్యనిది అసిస్టెంట్ కమిషనర్ న్యాయవాది అద్దంకి అమరేశ్వరరావు,మహిళా డైరెక్టర్ జల్లిసుజాత,డాక్టర్ అడపా రాజారావు,. పి సీతారామరాజు అన్నవరపు సతీష్ కుమార్, ఆరోగ్య సంస్థ ఉపాధ్యక్షులు చాట్ల లక్ష్మీనారాయణ, కోప్పిశెట్టి నాగేశ్వరరావు,కార్యదర్శి నల్లా నరసింహమూర్తి , అల్లూరి ప్రసాద రాజు, అల్లూరి తిరుపతి రాజు, వి మల్లేశ్వరరావు, పి .ఎల్ .నరసింహారావు బుజ్జి, కోశాధికారి బీ.వీ.వి సత్యనారాయణ జాలివాకర్ కడలి సత్యనారాయణ, మాకే బాలార్జున సత్యనారాయణ మనే ఈశ్వర్ కుమార్ పాల్గొన్నారు.