బుగ్గనకు అండగా నిలుద్దాం

డోన్ ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న బుగ్గన్న కి అండగా నిలుద్దాం
డోన్ యువతరం ప్రతినిధి;
డోన్ పట్టణంలోని 18 ,19వ వార్డు నాయకులు, కార్యకర్తలు శనివారం సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగినది. డోన్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేష్ గౌడ్ మాట్లాడుతూ
ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ ఫలాలను అందరకు చేరువ చేసే విధంగా వైయస్సార్సీపి సోషల్ మీడియా వారియర్స్ భాగస్వామ్యమై నియోజకవర్గంలో జరిగే ఎటువంటి అభివృద్ధిని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభ్యున్నతని కొనియాడుతూ ప్రజలను చైతన్యవంత పరుస్తూ సోషల్ మీడియా వేదిక ద్వారా ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ ల ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరువ, చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేసే విధంగా 18, 19 వార్డుల నందు కమిటీలను ఏర్పాటు చేసి వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఇంతియాజ్, అశోక్ ,కాలేశా, పెయింటర్ వెంకటేష్, రైల్వే నాయుడు ,స్వామి ,నరేష్ ,హమీద్ సోషల్ మీడియాకు కన్వీనర్ల అధ్యక్షతన ఆల ఈశ్వర్, విజయ్, మరియు కన్నా బాబు తదితరులు పాల్గొన్నారు