
బస్సు యాత్రను జయప్రదం చేయండి… కన్వీనర్ గోపాల్ రెడ్డి
అమడ గురు యువతరం విలేకరి;
తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన భవిష్యత్తు కు గ్యారీంటి బస్సు యాత్రను విజయవంతం చేయాలని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం బుగ్గలపల్లి నుండి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కావున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు క్రిష్ణా రెడ్డి, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడువల్లిపి కిష్టప్ప,వల్లిపి రామచంద్ర,తిరుపాలు, టైలర్ రమణరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.