ఘనంగా ఒలంపిక్ రన్

ఘనంగా ఒలింపిక్ రన్
విశాఖ యువతరం ప్రతినిధి;
ఒలింపిక్ సందేశం, ఒలింపిక్ స్ఫూర్తి, ఒలింపిక్ భావజాలం ఒలింపిక్ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి ఏటా జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒలింపిక్ దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ బీచ్ రోడ్ పాండు రంగాపురం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒలింపిక్ డే రన్ ఘనంగా జరిగింది. నోవోటెల్ ఎదురుగా గల పార్క్ సాంస్కృతిక వేదిక వద్ద 2022-2023 సంవత్సరంలో జాతీయ పతకాలు సాధించిన అన్ని క్రీడా ఈవెంట్‌ల నుంచి అంతర్జాతీయ పతక విజేతలందరినీ ఇద్దరు ఉత్తమ పురుష మహిళా క్రీడాకారులను గుర్తించి సత్కరించారు. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా క్రీడలు, క్రీడాకారుల ప్రయోజనాల కోసం అందించిన సుదీర్ఘమైన అంకితమైన సేవలకు గుర్తింపుగా విశాఖపట్నం జిల్లా క్రీడా సోదరుల నుంచి ఇద్దరు ఉత్తమ వ్యక్తులను గుర్తించి సత్కరించారు.
ఒలింపిక్ అసోసియేషన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఒలింపిక్‌డే రన్‌లో సాయ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలు పీ ఈ టి ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు, ఈవెంట్‌లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీతలు, అంతర్జాతీయ సాంకేతిక అధికారులు, భారత జట్టు మేనేజర్లు, అంతర్జాతీయ కోచ్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ప్రసాద్, అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి మోహన్ వెంకట్ రామ్ తదితరుల పర్యవేక్షణ లో జరిగింది.