ANDHRA PRADESH
పశు వైద్యశాలకు దారి సౌకర్యం ఏర్పాటు

పశువైద్యశాలకు దారి సౌకర్యం ఏర్పాటు
అమడుగురు యువతరం విలేఖరి
మండల కేంద్రంలోని స్థానిక పశువైద్యశాలకు గురువారం దారి సౌకర్యం కల్పించారు.గత రెండు సంవత్సరాలు క్రితం మండలంలో కురిసిన బారీ వర్షానికి పశువైద్యశాల సమీపంలో పూరాతనమైన బురుజు కూలడంతో పశువైద్యశాలకు వెల్లే దారికి అడ్డంగా రాళ్లు పడ్డాయి.దీంతో పశువైద్యశాలకు దారిలేక పాడి రైతులు ,సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో బుధవారం తహసీల్దార్ వెంకటరెడ్డి ,ఎంపీడీఓ గడ్డం మునెప్ప లు బురుజును పరిశీలించారు.వెంటనే స్పందించి ఎట్టకేలకు దారికి అడ్డంగా వున్న బురుజురాళ్లును తొలగించారు.పశువైద్యశాలకు దారి లేకపోవడంతో రైతులు,పశువైద్యశాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారు.బురుజురాళ్లను తొలగించడంతో రైతులు,సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.