
దొంగలు అరెస్ట్
విద్యుత్ మోటార్లు స్వాధీనం
కర్నూలు యువతరం ప్రతినిధి;
పట్టణంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు దొంగలను అరెస్టు చేసి విద్యుత్ మోటార్లను స్వాధీనం చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు. గురువారం ఆయన పోలీస్ స్టేషన్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 21న పట్టణంలోని సంతోష్ నగర్ లో గల సుంకులమ్మ దేవాలయం వద్ద ఐదుగురు దొంగలను అదుపులోని తీసుకున్నామన్నారు. వీరిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు సిఐ తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరించబడిన 12 విద్యుత్ నీటి మోటార్లను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. విద్యుత్ మోటార్ల విలువ రూ,2 లక్షల 3 వేల 280 లు ఉంటుందన్నారు. అదేవిధంగా 65 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురిని రిమాండ్ కు, మైనర్ బాలుడిని జువనైల్ హోమ్ కు తరలించామన్నారు.