
ఇలా వుంటే ఎలా
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బురదమయం
అమడుగురు యువతరం విలేకరి
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణం చిన్నపాటి వర్షానికే మడుగును తలపిస్తోంది.బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎంపీడీవో కార్యాలయ ఆవరణం ముందు వర్షపు నీరు నిలువ ఉండడంతో కార్యాలయానికి వచ్చే ఎంపీడీవో తో సహా, సిబ్బంది వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే మండల ప్రజలు మురుగునీరు నుండి నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యాలయ ఆవరణంలో వ్యవసాయ అధికార వ్యవసాయ అధికారి కార్యాలయం తో పాటు, హౌసింగ్ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం ఉండడంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు నిత్యం రద్దీగా
ఉంటుంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇదేమి కార్యాలయం అంటూ అధికారులపై విమర్శలు గుప్పించారు.గురువారం వ్యవసాయ కార్యాలయంలో వేరుశనగ కాయలు పంపిణీ చేయడంతో రైతులు వర్షపు నీటిలోనే వస్తూపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.నిత్యం అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు ఉండే కార్యాలయమే ఇలా మురుగునీరుతో ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నించారు. ఇక మారుమూల గ్రామాల్లో ఎలా ఉంటుందో దీనిబట్టి అర్థమవుతుందని పలువురు అధికారులు నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న మురుగునీరుని తొలగించి వర్షపు నీరుకు నిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.