ANDHRA PRADESH
పశువుల వైద్యశాలకు దారి సౌకర్యం కల్పిస్తాం

పశువుల వైద్యశాలకు దారి సౌకర్యం కల్పిస్తాం
తాసిల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో మునెప్ప
అమడగురు యువతరం విలేఖరి;
ఆమడగూరు మండల కేంద్రంలోని స్థానిక పశువైద్య శాలకు దారి లేక రైతులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం భారీ వర్షాలకు పశువైద్యశాల సమీపంలోని పురాతనమైనటువంటి బురుజు కూలిపోవడంతో అప్పటినుండి దారి లేక పశువైద్యశాలకు వెళ్లేందుకు పాడి రైతులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుధవారం తహసిల్దార్ వెంకట్ రెడ్డి ఎంపీడీవో మునెప్ప లు బస్సు వైద్యశాలకు వెళ్లి పరిశీలించారు. దారికి అడ్డంగా ఉన్న బురుజురాలను తొలగించి వెంటనే దారి సౌకర్యం కల్పిస్తామని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఈశ్వరయ్య వీఆర్వో మోదిన్ భాష సర్వేయర్లు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.