ANDHRA PRADESHCRIME NEWS

శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు

శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు

ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదు

కర్నూల్ డీఎస్పీ రాఘవేంద్ర

కర్నూలు ప్రతినిధి జులై 5 యువతరం న్యూస్:

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతత దృష్ట్యా భారతీయ పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 30 పోలీసు యాక్ట్ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కర్నూల్ డీఎస్పీ శ్రీ రాఘవేంద్ర శనివారం తెలిపారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో తరచుగా జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు తదితర కార్యక్రమాల వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కర్నూల్ డీఎస్పీ రాఘవేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ప్రజా సమావేశాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
అనుమతుల కోసం ఆర్గనైజర్లు, నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఈ ఉత్తర్వులు జులై 31 వరకు కర్నూలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అమల్లో ఉంటాయని తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!