ఐకమత్యంతోనే జర్నలిస్టుల హక్కుల సాధన సాధ్యం

ఐకమత్యంతోనే జర్నలిస్టుల హక్కుల సాధన సాధ్యం
ఏపీయూడబ్ల్యూజే నగర మహాసభ ఘనంగా నిర్వహణ.
నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కర్నూలు ప్రతినిధి జూలై 5 యువతరం న్యూస్:
జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం ఐకమత్యంతో ముందుకు సాగితేనే ఫలితాలు సాధ్యమని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈ.ఎన్. రాజు అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌లోని ఏపీ ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఏపీయూడబ్ల్యూజే నగర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ. కొండప్ప, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, కోశాధికారి అంజి, సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, అవినాష్, సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్ పాల్గొని ప్రసంగించారు.
వారు మాట్లాడుతూ అధికారంలో ఎవరు ఉన్నా జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కర్నూలు నగరంలో ఇప్పటికీ ప్రెస్ క్లబ్ లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ, అందరి సహకారంతో త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, గృహాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2026–27 సంవత్సరానికి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని, పాత సభ్యులు రూ.150తో రెన్యువల్ చేసుకోవాలని, కొత్త సభ్యులు రూ.200 చెల్లించి సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు.
నూతన నగర కమిటీ ఎన్నిక
మహాసభ అనంతరం ఏపీయూడబ్ల్యూజే కర్నూలు నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడు: నాగేశ్వరరావు
ప్రధాన కార్యదర్శి: బీ. మల్లికార్జున
కోశాధికారి: శివన్న
ఉపాధ్యక్షులు: రమేష్, ఆసిఫ్, ఎల్లగౌడ్
సహాయ కార్యదర్శులు: రమేష్ రెడ్డి, రవిరాజ్, సూరి
కార్యవర్గ సభ్యులు: మధుసూదన్ రాజ్, నాగేంద్ర, గజేంద్ర నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను జిల్లా నాయకులు శాలువాలు, మెమెంటోలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఫీతో పాటు పలువురు జర్నలిస్టులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.



