ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీశైలంలో ఆలయ విమాన గోపురానికి ఘనంగా పాగాలంకరణ

రమణీయం... కమనీయం... నయనానందకరంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం

శ్రీశైలంలో ఆలయ విమాన గోపురానికి ఘనంగా పాగాలంకరణ

శివనామస్మరణతో మార్మోగిన శ్రీశైల మహాక్షేత్రం

అశేష భక్తజన వాహిని మధ్య భక్తిశ్రద్ధలతో లింగోద్భవ మహన్యాస రుద్రాభిషేకం, పాగాలంకరణ

రమణీయం… కమనీయం… నయనానందకరంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం

శ్రీశైలం / నంద్యాల ప్రతినిధి ఫిబ్రవరి 15 యువతరం న్యూస్:

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి ఆలయ విమాన గోపురంపై పాగాలంకరణ ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ సమయానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది.చీరాల వాస్తవ్యులు పృధ్వి వెంకటేశ్వర్లు సంతతి పృధ్వి సుబ్బారావు భక్తిశ్రద్ధలతో 365 రోజుల పాటు ప్రతిరోజూ ఒక మూర చొప్పున నేత నేసి సిద్ధం చేసిన పాగాను స్వామివారికి సమర్పించారు. ఆలయ సాంప్రదాయ పద్ధతులనుసరించి సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ పాగాలంకరణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఈ సందర్భంగా భక్తులు ఏకస్వరంతో శివనామస్మరణ చేస్తూ క్షేత్రాన్ని మార్మోగించారు.

అనంతరం నాగలకట్ట సమీపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రమణీయంగా, కమనీయంగా, నయనానందకరంగా జరిగిన ఈ కల్యాణ మహోత్సవాన్ని దర్శించేందుకు అశేష భక్తజన వాహిని తరలివచ్చింది. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తులకు కన్నుల పండుగగా నిలిచాయి.

ఈ ఉత్సవ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్‌.ఎస్‌. చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!