పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు


పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం
ఉన్నతాధికారులతో సమీక్ష
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కేక్ కట్ చేసి ఆప్యాయంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
జీలుగుమిల్లి జనవరి 08 యువతరం న్యూస్:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తిచేయాలని, అలాగే కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మే మొదటి వారంలో మరోసారి ప్రాజెక్టు పనులను తనిఖీ చేస్తానని సీఎం తెలిపారు.
ఈ పర్యటనలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం వెంట ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. అనంతరం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రాజెక్టు పురోగతి, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
సమీక్ష సమావేశం అనంతరం, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



