రైతులకు అండగా కూటమి ప్రభుత్వం


రైతుల అండగా కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
దేవనబండ లో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణి
పత్తికొండ ప్రతినిధి జనవరి 2 యువతరం న్యూస్:
పత్తికొండ మండలం దేవనబండ గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణి చేసిన ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందజేసింది..వెబ్ ల్యాండ్ లోని వివరాల ప్రకారమే ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని ఉన్నారు. అయితే అధికారులు పాస్ బుక్ ఇచ్చేటప్పుడు రైతుల వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.గత ప్రభుత్వ హయాంలో 8వేల గ్రామాల్లోని భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టారన్నారు. అనంతరం క్యూఆర్ కోడ్ తోపాటు పాస్ పుస్తకాలపై వైయస్ జగన్ బొమ్మతో భూహక్కు పత్రాలనిచ్చారని చరిత్ర లో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు అని ఒక పిచ్చి తుగ్లక్ పాలన గుర్తు వచ్చేలా చేశారు అని అన్నారు . ఆ విషయం రైతులను ఎంతో ఆందోళనకు గురి చేసిందన్నారు. ఇప్పుడు రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ప్రకటించారు.2026వ సంవత్సరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పీఎం నరేంద్ర మోడీ,సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చూపిన మార్గంలో తాము ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలని ఏపీని పున: నిర్మించుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో భరత్ నాయక్, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



