సొంత ధనంతో రహదారి సమస్యను తీర్చిన బంకు రాము, రెడ్డి అబ్బులు సేవా గుణానికి మూడు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు

సొంత ధనంతో రహదారి సమస్యను తీర్చిన బంకు రాము, రెడ్డి అబ్బులు సేవా గుణానికి మూడు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు
అమలాపురం ప్రతినిధి డిసెంబర్ 28 యువతరం న్యూస్:
ముమ్మిడివరం నగర పంచాయతీ చివర మల్లాయపాలెం గ్రామం కి వెళ్లే రహదారి ఇటీవలే కురిసిన వర్షలకు పాడైంది ఆ రహదారి వెంట ప్రయాణం చేసే మల్లాయిపాలెం ప్రజలు, పైకోడు మెరక గ్రామ ప్రజలు మరియు ఉందుర్తి వారి పేట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వస్తే ఆ రహదారి వెంట రాకపోకలు నిలిసిపోతున్నాయి, ఇ విషయం పై 12 వ వార్డు ప్రజలు నిధులు సమీకరణం కోసం ఆక్వా రైతు బంక్ రాము మరియు రెడ్డి అబ్బులు లను సంప్రదించగా వెంటనే స్పందించి అక్కడ అయ్యే గ్రావెల్ ఖర్చు మొత్తం పెట్టుకుంటామని ముందుకు రావడం, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే యాభైవేల రూపాయిల గ్రావెల్ నీ వేసి స్థానిక గ్రామ ప్రజలకు రహదారి సమస్య ను తీర్చినారు ఈ సందర్బంగా బంక్ రాము నురెడ్డి అబ్బులను మల్లాయిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు ప్రెసిడెంట్ యాళ్లమెల్లి వెంకటేశ్వరావు, రాష్ట్ర డ్వాక్రా అంగన్వాడి సాధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల, గెడ్డం శ్రీనివాసరావు, దొంగ గంగాధర్, జంగా మణికంఠ, భీమవరపు దుర్గ బాబు, రమణాతి శివ , జంగా రమేష్, సంసాని నాగరాజు, మెండి రాజశేఖర్ , గడ్డం శ్రీనివాస్ ,విత్తనాల నాగరాజు లు కలిసి ఆక్వా రైతు బంక్ రాము,రెడ్డి అబ్బులు వీరిద్దరి సేవా గుణానికి,మంచి హృదయానికి కృతజ్ఞతలు తెలియజేసారు.



