ANDHRA PRADESHEDUCATIONSTATE NEWS
కిడ్స్ జావోలీన్ పోటీలో మొదటి స్థానంలో విశ్వజ్యోతి స్కూల్ విద్యార్థిని

కిడ్స్ జావోలీన్ పోటీలో మొదటి స్థానంలో విశ్వజ్యోతి స్కూల్ విద్యార్థిని
జమ్మలమడుగు డిసెంబర్ 22 యువతరం న్యూస్:
డిసెంబర్21 న ప్రొద్దుటూరు ఏబిఎంహెచ్ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన అథ్లెటిక్స్ కిడ్స్ జావోలీన్ పోటీలో జిల్లా స్థాయి లో మొదటి స్థానం కే.లిఖిత సాధించినట్లు విశ్వజ్యోతి స్కూల్ కరస్పాండెంట్ మారెడ్డి తెలియజేశారు.విద్యార్థిని కి అభినందన సభ ఏర్పాటు చేసి తమ విద్యార్థులు చదువుల్లోనే కాక క్రీడల్లో కూడా ముందుంటారని ఆటలకు కావలసిన అన్ని పరికరాలు స్కూల్ యాజమాన్యం అందించి క్రీడలలో ముందు ఉండేలా ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు.కార్యక్రమం లో పాఠశాల హెచ్ఎం పరిమళ పాఠశాల ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు సంజీవ్,షాహీన పాల్గొనడం జరిగింది.



