
పంచాయతీ రూపురేఖలు మారుస్తా
మగ్దుంపూర్ సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన పేరుమాండ్ల పార్వతమ్మ
నాగర్ కర్నూల్ ప్రతినిధి డిసెంబర్ 22 యువతరం న్యూస్:
గ్రామానికి అన్ని రకాల అభివృద్ధితోపాటు పంచాయతీ రూపురేఖలు మారుస్తానని మగ్గంపూర్ సర్పంచ్ పేరుమాండ్ల పార్వతమ్మ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు గ్రామస్తుల సలహా మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో మౌలిక వసతులు రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలు పరిష్కరించడంతోపాటు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేతావత్ రవి, వార్డు మెంబర్లు సుల్తాన్ గౌడ్, రుక్మిణి, నిరంజనమ్మ, మహేష్, సరిత, శాంత, భాషా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్ గ్రామస్తులు ఉన్నారు.



