వైద్య ఖర్చుల నిమిత్తం ప్రజలెవరు అప్పుల పాలవకూడదు అన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం

వైద్య ఖర్చుల నిమిత్తం ప్రజలెవరు అప్పుల పాలవకూడదు అన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం
రేపల్లె డిసెంబర్ 16 యువతరం న్యూస్:
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు పాలు కాకూడదన్న సీఎం చంద్రబాబు గారి ఆలోచన అని అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మంత్రి అనగానే 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ 46 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్ఓసిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనగానే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ప్రజలకు సకాలంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలు అందచేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకా రామకృష్ణ, వి శివ సుబ్రహ్మణ్యం, వేణు, వివిధ మండలాల కూటమి నాయకులు పాల్గొన్నారు.



