జర్నలిస్టు కుటుంబంలో అక్షరాల ఆనందోత్సవం
పితాని సూర్య ప్రసాద్ ద్వితీయ కుమార్తె సాయి సౌమ్యకు డాక్టర్ డిగ్రీ


జర్నలిస్టు కుటుంబంలో అక్షరాల ఆనందోత్సవం
పితాని సూర్య ప్రసాద్ ద్వితీయ కుమార్తె సాయి సౌమ్యకు డాక్టర్ డిగ్రీ
ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 27 యువతరం న్యూస్:
ప్రముఖ పత్రికా ఎడిటర్, జర్నలిస్టు సూర్య ప్రసాద్ పితాని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వారి ద్వితీయ కుమార్తె సాయి సౌమ్య బెంగళూరులోని శ్రీ శ్రీ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద & రీసెర్చ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో డాక్టర్ డిగ్రీ అందుకొని ఉత్తీర్ణుల బరిలో వెలుగొందింది.
కుటుంబ సంకల్పం, కృషి, మరియు విద్యపై నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచిన ఈ విజయం పితాని కుటుంబానికి మరువలేని గౌరవానికీ, ఆనందానికీ నిలిచింది. సమున్నత లక్ష్యంతో కష్టపడి, ధృఢమైన పట్టుదలతో ముందుకు సాగిన సాయి సౌమ్య సాధన అభినందనీయమని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
సాయి సౌమ్య విద్యా ప్రయాణంలో తోడ్పడ్డ గురువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు సూర్య ప్రసాద్ పితాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గస్తులైన తన తల్లిదండ్రుల దీవెనలతో పాటు, స్నేహితులు, అభిమానుల ఆశీస్సులు తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
డాక్టర్ సాయి సౌమ్యకు
పితాని కుటుంబానికి
అభినందనలు తెలియజేస్తూ—
అనేక విజయాలు అలవోకగా చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.



