ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

రికవరీ చేసిన 669 ( విలువ రూ. 1 కోటి 20 లక్షలు ) మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత

రికవరీ చేసిన 669 ( విలువ రూ. 1 కోటి 20 లక్షలు ) మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

జిల్లా పోలీసు కార్యాలయంలో “ 3 వ మొబైల్ రికవరీ మేళా ” కార్యక్రమం

ఎచ్ టిటిపి://కర్నూలుపోలీస్.ఇన్/మొబైలతేఫ్ట్ లింకును క్లిక్ చేసి , సెల్ ఫోన్లు పోగోట్టుకున్న బాధితులు ఆ మొబైల్ ఫోన్ వివరాలు నమోదు చేయండి

ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తాం

ఎలాంటి రుసుము లేదా ఫీజు గాని ఉండదు

ఎచ్ టిటిపి://కర్నూలుపోలీస్.ఇన్/మొబైలతేఫ్ట్ పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అత్యధిక మొబైల్స్ రికవరీ చేసిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ

కర్నూల్ క్రైమ్ నవంబర్ 6 యువతరం న్యూస్:

బుధవారం కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 669 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్ల ను బాధిత ప్రజలకు అందజేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
బుధవారం కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు 669 ( విలువ రూ. 1 కోటి 20 లక్షలు) మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు.
ప్రజలు ప్రయాణాలలో, రైల్వేస్టేషన్లు, జాతరలు, ఉత్సవాలలో ఇలా పలు చోట్ల మొబైల్స్ ను పొగోట్టుకుంటున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహరాష్ట్ర, తెలంగాణ మరియు పలు జిల్లాల నుండి రికవరీ చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసును, ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పోలీసులను అభినందిస్తున్నామన్నారు.
ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు. ప్రతి రోజూ ప్రతి పని లో మొబైల్ ఉపయోగం ఉంటుందన్నారు. మొబైల్ లో మనకు సంబంధించిన స్డడీ యాప్స్, చిన్న పిల్లల ఫోటోలు, ఆన్ లైన్ బ్యాంకు ఖాతా వ్యవహరాలు పర్సనల్ వివరాలు, ఫోన్ నెంబర్లు, వ్యాపార లావా దేవిలు, అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారన్నారు.
ఈ సంవత్సరంలో మూడవ సారి మొబైల్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఎవరైనా మొబైల్ పోగోట్టుకుంటే వెంటనే కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు ఎచ్ టిటిపి://కర్నూలుపోలీస్.ఇన్/మొబైలతేఫ్ట్ వెళ్ళి పొగోట్టుకున్న మొబైల్ ఐఎంఈ వివరాలు తెలియజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు. ఈ పోలీసు సేవ కు ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితం అని , మొబైల్ పోయిన తర్వాత బాధపడడం కంటే ఆ మొబైల్ ఫోన్ పోగోట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
669 మొబైల్స్ లలో అత్యధికంగా రికవరి చేసిన కర్నూలు ఫోర్త్ టౌన్ పియస్- కర్నూలు డిఎస్పీ ఆఫీసు అటాచ్ మెంట్ లో పని చేస్తున్న శేఖర్ బాబు 96 మొబైల్స్, ఆదోని టు టౌన్ పియస్ కు చెందిన నాగరాజు 30 మొబైల్స్ , ఇస్వి పియస్ కు చెందిన రామచంద్ర 16 మొబైల్స్ రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ అభినందించి , ప్రశంసా పత్రాలు అందజేశారు.
సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితులు రికవరీ చేసి ఇచ్చినందుకు జిల్లా ఎస్పీ కి, సైబర్ ల్యాబ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
1) మాధవ రెడ్డి – కర్నూలు, పెద్దమార్కెట్.
నా మొబైల్ ను జనవరి 2024 లో కర్నూలు కొత్తబస్టాండు దగ్గర పొగోట్టుకున్నాను. నా ఫోన్ ను కర్నాటక రాష్ట్రం లో రికవరీ చేయడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
2) రామక్రిష్ణ – కర్నూలు.
నా మొబైల్ ను కర్నూలు, విశ్వభారతి హాస్పిటల్ లో పొగోట్టుకున్నాను. నంద్యాల జిల్లా, ఆత్మకూరు లో రికవరీ చేయడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
3) శాంతకుమారి – కర్నూలు .
కర్నూలులో ఉన్న వావిలాల స్విమ్మింగ్ పూల్ దగ్గర మా అబ్బాయి మొబైల్ పొగోట్టుకున్నాడు. ఏప్రిల్ నెలలో మా అబ్బాయి చదువుకునే యాప్స్ అన్ని మొబైల్ లో ఉండేవి , చదువుకునే డేటా అంతా పరీక్షల సమయంలో పోవడంతో చాలా ఇబ్బందిగా ఉండేది. మొబైల్ కోడుమూరు లో దొరకడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
4) హారిక – కర్నూలు.
కర్నూలు వెంకటరమణ కాలనీ దగ్గర నా మొబైల్ పోయింది. నా మొబైల్ ను మహరాష్ట్ర లో రికవరీ అయింది. నా మొబైల్ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
5) మహేష్ – కర్నూలు, బి. తాండ్రపాడు. కర్నూలు, వెంకాయపల్లి దగ్గర మొబైల్ ను పొగోట్టుకున్నాను. నా మొబైల్ హైదరాబాద్ లో రికవరీ కావడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, సిఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, నాగరాజా రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం పోలీసులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!