వాజేడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ

వాజేడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ
ములుగు ప్రతినిధి అక్టోబర్ 13 యువతరం న్యూస్:
సోమవారం అదనపు ఎస్.పి శివమ్ ఉపాధ్యాయ్ ఐపీఎస్ ఏటూరునాగారం వార్షిక తనిఖీల్లో భాగంగా వాజేడు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని సిబ్బంది హాజరు, టర్న్ అవుట్ (టర్న్ అవుట్), డిసిప్లిన్ (డిస్కప్లైన్), రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, ఆయుధాలు అమ్యూనిషన్ భద్రత, స్టేషన్ పరిశుభ్రత, ఫైల్స్ చెక్ చేయడం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు,అదనపు ఎస్.పి పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణ మరియు ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం అవసరమని సూచించారు,అలాగే పోలీసుస్టేషన్ పరిధిలో నేర నియంత్రణ చర్యలు, పహారా వ్యవస్థ, గస్తీ కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు, సందర్బంగా గౌరవ అదనపు ఎస్.పి మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరణ, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ బలోపేతం, గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంచాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు,తనిఖీ సమయంలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ ఎం,రమేశ్ వెంకటాపురం ఎస్ఐ కే తిరుపతి గారు సబ్‌ఇన్స్పెక్టర్ వాజేడు జె,సతీష్ గ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.