పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు రాబట్టిన మంత్రి నారా లోకేష్ కు మంత్రి అనగాని అభినందనలు

పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు రాబట్టిన మంత్రి నారా లోకేష్ కు మంత్రి అనగాని అభినందనలు
రేపల్లె అక్టోబర్ 09 యువతరం న్యూస్:
దేశ చరిత్రలోనే రూ.87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టనున్న రైడెన్ ఇన్ఫో టెక్ డాటా సెంటర్ కు ఎస్ఐపిబి ఆమోద ముద్ర వేసింది. ఈ నేపద్యంలో అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపిబి ల ద్వారా రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని మంత్రి అనగాని ఈ సందర్భంగా తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల సాధనే లక్ష్యంగా ఎస్ఐపిబి ముందడుగు వేస్తోందని మంత్రి అనగాని తెలిపారు.