జీవసుధ ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్ నందు ప్రాంతీయ స్థాయిలో కిషోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం

జీవసుధ ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్ నందు ప్రాంతీయ స్థాయిలో కిషోరి వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం
కర్నూల్ ప్రతినిధి ఏప్రిల్ 27 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం కర్నూలు జిల్లాలోని జీవ సుధా ప్రాంగణంలోనీ ట్రైనింగ్ సెంటర్ నందు ప్రాంతీయ స్థాయిలో కిషోరీ వికాసం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు మూడు జిల్లాల నుండి (కడప నంద్యాల కర్నూలు)నోడల్ ఆఫీసర్, సిడిపిఓ సు, డిసిపిఓ సు, తదితరులు హాజరు కావడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమమును యూనిసెఫ్ ప్రతినిధులచే ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముందుగా ఐసిడిఎస్. పిడి. పి .నిర్మల
శిక్షణ కార్యక్రమం కు హాజరైన మిషన్ వాచల్య పోగ్రామ్ మేనేజర్ కి యూనిసెఫ్ రీసెర్స్ పర్సన్ వారికి స్టేట్ డబ్ల్యు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కన్సల్టెంట్ కు మరియు మూడు జిల్లాల నుండి విచ్చేసిన సిడిపిఓస్ మరియు నోడల్ ఆఫీసులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమమును జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించడం జరిగినది ముందుగా కర్నూలు జిల్లా ఐసిడిఎస్. పిడి మాట్లాడుతూ కిషోర్ వికాసం జిల్లాలో యుక్త వయస్సు బాలికల సాధికారతలో భాగంగా వేసే సెలవులు యoదు ప్రతీక క్యాలెండర్ విడుదల చేస్తూ గ్రామాలలో వారికోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించడానికి శనివారం మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు గ్రామస్థాయిలో మనము బాలికల సాధికారత కోసము క్యాలెండర్ ప్రకారం ఏ యాక్టివిటీస్ చేయాలో శనివారం వర్క్ షాప్ నుండి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే బాల్యవివాహాల నివారించడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎలా ముందుకు బాలికల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదామని పిలిపించారు. మరియు జిల్లా యువనైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ మాట్లాడుతూ పుట్టిన ప్రతి శిశువు మొదలుకొని దాదాపు10 సంవత్సరాల వరకు తప్పనిసరిగా కచ్చితంగా టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరియు కడప జిల్లా జి సి డి వో అనిత మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని అదేవిధంగా మనమందరము కష్టపడాలని అదేవిధంగా కిషోర్ బాలికలు అవగాహన రహితం వల్ల జరిగే అనేక అనర్థాల గురించి కూడా వారికి ఎప్పటికప్పుడు అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరియు కడప జిల్లా మెప్మా సీఈవో కల్పన మాట్లాడుతూ గ్రామంలో మహిళ సాధికారత కోసం ఎస్సై జి సంఘ సభ్యుల ద్వారా గ్రామస్థాయిలో వివో మీటింగ్స్ మండల స్థాయిలో మీటింగ్లో బాల్య వివాహాల గురించి అజెండా పాయింట్స్ రాసుకొని చర్చించడం జరుగుతుందని ఇంకా అన్ని వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కిషోర్ బాలికల సాధికారత కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. మరియు కర్నూలు జిల్లా మహిళా పోలీస్ సిఐ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో హోంశాఖ బాలల పరిరక్షణకు మరియు మహిళ పరిరక్షణ కోసం ఏ సమయంలో అయినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అదే విధంగా గతంలో మహిళలు మరియు బాలల పరిరక్షణ కోసం జిల్లాలో వివిధ శాఖల సమావేశం డ్రైవ్స్ గాని రైట్స్ గాని నిర్వహించి అలాంటి బాలల మరియు మహిళల పరిరక్షణ కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మా హోం శాఖ నుంచి అన్నివేళలా మీకు సపోర్టుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్సెఫ్ ప్రతినిధులు జోన్స్ మరియు నరసింహమూర్తి రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ స్టేట్ ఆఫీసర్ కమల్ కుమార్ కార్యక్రమం కార్యక్రమమును వివిధ గ్రూప్స్ యాక్టివిటీ ద్వారా మరియు రోల్ ప్లే ద్వారా మరియు చిన్న చిన్న స్క్రిప్ట్ ద్వారా కిషోర్ బాలికల సాధికారత మరియు ఎంపవర్మెంట్ పై శిక్షకులకు ట్రైనింగు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమమునకు మూడు జిల్లాల నుంచి సిడిపివో మరియు డిసిపి వాళ్ళు నోడల్ ఆఫీసర్స్ మరియు విద్యా వైద్య మెప్మా డి ఆర్ డి ఏ గ్రామ వార్డు సచివాలయాల ప్రతినిధులు మొదలైన తదితర శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమాల హాజరు కావడం జరిగింది. మరియు కార్యక్రమంలో జిల్లా డిసిపిఓ శారద మరియు డిసిపియు సిబ్బంది శ్రీలక్ష్మి , దీప, గీతా ,పద్మ, నరసింహులు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.