ANDHRA PRADESHBREAKING NEWSDEVELOPSTATE NEWSWORLD
అన్న క్యాంటీన్ కు విశ్రాంత అధ్యాపకురాలు రూ.5 లక్షలు విరాళం

అన్న క్యాంటీన్ కు 5 లక్షల విరాళం
యువతరం డెస్:
అన్న క్యాంటీన్లకు గుంటూరు నగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు మేకా తులసమ్మ రూ.5లక్షలు విరాళమిచ్చారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకురాలిగా సుదీర్ఘంగా సేవలందించిన ఆమె ఉద్యోగ విరమణ చేశారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి చెక్కు అందజేశారు. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం అభినందించారు.