ఇంటింటికి తాగు నీటి కుళాయిల నిర్మాణం తొందరలోనే చేపడతాం

ఇంటింటికి తాగు నీటి కుళాయిల నిర్మాణం తొందరలోనే చేపట్టుతాం..
గ్రామంలో పారిశుధ్యం పై కఠినంగా వ్యవహరించండి..
పట్టణంలో పది రోజులకు ఒకసారి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టండి..
పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు
(యువతరం డిసెంబర్ 11)
దేవనకొండ విలేఖరి:
దేవనకొండ మండల కేంద్రంలో శనివారం పలు కాలనీలలో కొందరికి వాంతులు విరేచనాలతో అతిసార కు గురైనా విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పంచాయతి రాజ్ జిల్లా అధికారి నాగేశ్వరరావు ఆదివారం దేవనకొండ లో వడ్డే కాలనీ, ఎర్ర గోటి పలు కాలనీలలో పర్యటించి అతిసార ఎలా ప్రబలిందో విచారించారు.గ్రామంలో ప్రధానంగా కలుషిత నీరు అపరిశుభ్రత కారణంగా ఈ సంఘటన జరిగింది అన్నారు. దీనిపై స్ధానిక పంచాయతి సిబ్బందిపై సిరయస్ అయ్యారు. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. పట్టణములో పది రోజులకు ఒకసారి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రధానంగా కాలువలు లో ఉండే త్రాగు నీరు పైపులకు మరమ్మతులు చేపట్టామన్నారు, గ్రామ వీధుల్లో దోమల పోగ, బ్లీచింగ్ పౌడర్ పిచికారి, చేయలని వాటర్ ట్యాంకులలో ఎప్పటి కప్పుడు శుభ్రం చేయలని పంచాయతి సిబ్బందికి తెలియాచేశారు. ఈలాంటి సంఘటనలు మరల పునరావృతం అయితే చర్యలు తప్పవన్నారు. అదేవిదంగా ప్రతి ఇంటికి తాగు నీటి కొలాయుల నిర్మాణము తొందర లోనే చేపట్టుతామని అన్నారు.అనంతరం కాలనీలో ఏర్పాటు చేసినా మెడికల్ క్యాంపు ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కిట్టు, ఈవోర్డి సూర్య నారాయణ, పంచాయతి సెక్రటరీ రెహమాన్, అర్ డబ్ల్యు ఏఈ మురళి తదితర అధికారులు పాల్గొన్నారు.