ANDHRA PRADESHPOLITICS
ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎమ్ హెచ్: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంహెచ్ దీపావళి శుభాకాంక్షలు
(యువతరం నవంబర్ 12) 0 మంగళగిరి ప్రతినిధి:
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి , దుష్ట శక్తుల మీద దైవ శక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఎమ్మెల్యే ఆర్కే ఆకాంక్షించారు. ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని, అన్నదాత కళ్లలో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.