తెలుగు భాష తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక
రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్


తెలుగు భాష తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక
రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్
అమలాపురం మార్చి 1 యువతరం న్యూస్:
సుదీర్ఘ చరిత్రను, మహో న్నత సాహిత్య సంపదను, అద్భుతమైన సాంస్కృతిక వైభవాన్ని కలిగిన తెలుగు భాష తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకని దేశ భాషలందు తెలుగు లెస్సనీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు స్థానిక కిమ్స్ ప్రాంగణము నందు గోదావరి గ్లోబల్ యూ నివర్సిటీ, కిమ్స్ సంయు క్తంగా అధినేత చైతన్య రాజు ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మూడవ ప్రపంచ తెలుగు మహాస భలలో రెండో రోజైన ఆది వారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ముందుగా ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన తెలుగు వారందరికీ, హృదయ పూర్వక వందనాలు తెలిపారు.ఈ మూడవ ప్రపంచ తెలుగు మహా సభల వేదికపై మీ ముందు ప్రసంగించడం గొప్ప గౌర వం ఆనందంగా భావి స్తున్నానన్నారు. దేశభాష లందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మా టలు ఈనాటికి మనకు స్ఫూర్తిని నింపుతున్నా యన్నారు.వ్యవహారిక భాషా ఉద్యమ పితామ హుడు గిడుగు రామ్మూర్తి
తెలుగు భాషా వికాసంలో మహత్తర పాత్ర పోషించిన భాషావేత్త, సంస్కర్త అని ఆయన ముఖ్యంగా వ్య వహారిక తెలుగు ప్రాచు ర్యానికి కృషి చేసి, తెలుగు భాషను ప్రజలకు చేరువ చేశారన్నారు. అమృత భాష తెలుగని మన సంస్కృతి సాంప్రదా యాలను గుర్తు చేస్తుంద న్నారు నేటి ఆధునిక యుగంలో తెలుగు భాష ప్రాచుర్యం పొందుతూనే ఉందన్నారు తెలుగు భాష ను ప్రోత్సహించాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు
భావితరాలు తెలుగు భాష సంస్కృతిని ఔన్నత్యాన్ని విలువలను కాపాడడానికి ముందడుగు వేయాలన్నా రు. సుమారు 100 మిలి యన్లు ప్రజలు వివిధ రాష్ట్రా లలో తెలుగువారు ఉన్నా రని తెలుగు భాష గొప్పదనాన్ని విస్తృతం చేసి తెలుగు భాష ఉనికిని కాపాడుకోవాలన్నారు చేయాలన్నారు తెలుగు భాష ఔన్నత్యం, మాధు ర్యం, వైభవం గురించి కృషి చేసిన అనేక మంది మహానుభావులు ప్రశం సించారన్నారు సంస్కృత మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించి, తెలుగు భాషకు శాస్త్రీయ బలం చేకూర్చాడన్నారు.
తెలుగు కూడా శాస్త్రీయ రచనలకు తగిన గొప్ప భాషని నిరూపించారన్నా రు.తెలుగు భాషలో శాస్త్ర, కవిత్వ రచనలు చేయగల సామర్థ్యం ఉందని రుజువు చేశారన్నారు.తెలుగు భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదని మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానమన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రప్ర గడ వంటి మహాకవుల ద్వారా మహాభారతం ఆంధ్రీకరణం జరగడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయమన్నా రు పోతన గారి భాగవతం, వేమన గారి సుభాషితాలు మన జీవిత విలువలను ప్రతిబింబిస్తున్నాయన్నారు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు పిల్లలు తమ భాషను, తమ మూలా లను మరువకుండా ముందుకు సాగాలన్నారు. భాషను కాపాడటం అంటే కేవలం పాఠ్యపుస్తకాలలో కాదని దానిని దైనందిన జీవితంలో ఉపయోగిం చడం, సాంకేతిక రంగాల, లో అభివృద్ధి చేయడం, కొత్త తరాలకు అందించడం కూడా అంతే ముఖ్యమ న్నారు. శ్రీకృష్ణదేవరాయ లు ఆముక్తమాల్యద వంటి గ్రంథంతో తెలుగు కవిత్వ ఔన్నత్యాన్ని చాటాడన్నా రు.తెలుగు భాష దేశభా షలలో అగ్రగణ్యమైనద న్నారు. కందుకూరి వీరే శలింగం ఆధునిక తెలుగు గద్యానికి పితామహుడనీ
సరళమైన, సుస్పష్టమైన తెలుగు వాడకాన్ని ప్రో త్స హించాడన్నారు..తెలుగు భాషలో సామాజిక సంస్క రణ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. తెలు గు భాష సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనంగా భావించారన్నారు. తెలుగు భాషలో తీర్పు చెప్పే వారికి సహనం, చదువులు బోధిం చే వారికి ఓర్పు ఉండాలని సూచించారు ఆదికవి నన్న య్య మహాభారతానికి సంస్కృత శైలిని తెలుగు భాషలో ప్రవేశపెట్టి తెలుగు సాహిత్యానికి పునాది వేశారన్నారు.తిక్కన మహాభారతాన్ని కొన సాగించి, సులభమైన భాషలో రచనలు చేసి ప్రజల్లో తెలుగు ప్రాచుర్యం పొందేలా చేశారన్నారు
ఏర్రప్రగడ మహాభారతాన్ని పూర్తిచేసి తెలుగు సాహి త్యాన్ని మరింత బల పరిచారన్నారు వీరిని కవిత్రయమని పిలుస్తా రన్నారు. వీరి కృషితో తెలుగు భాష సాహి త్యరంగం స్థిరపడింద న్నారు. తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసినఎందరో మహనీయులకు ఆయన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు తెలుగు కళా ప్రతిభను చాటేలా పోటీలు స్టాల్స్ నిర్వహిస్తూ భావిత రాలకు తెలుగు ఔన్నత్యా న్ని తెలుగు ప్రాచుర్యాన్ని విశ్వ వ్యాప్తం చేసేలా చైత న్య రాజు చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ తెలుగు భాష రచయితలను స్ఫూర్తిగా తీసుకొని చైతన్య రాజు కృషిని అభినందించారు. ప్రపంచీకరణ నేప థ్యంలో వివిధ భాషలకు అనేక సవాళ్లు ఎదురవు తున్నాయని దీన్ని దీటుగా ఎదుర్కొని తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు చైతన్య రాజు భావితరాలు భాషా సం స్కృతులు కాపాడా ల్సిన వారసత్వా న్ని ముందుకు తీసుకెళ్లాలనే రీతిలో ఈ మహాసభల ద్వారా యువ తను ముందుకు తీసుకెళ్లా ల్సిన ఆలోచన చేసినందు కు చైతన్య రాజును అభి నందించారు ఆంధ్ర ఉద్య మం మూలంగా భాషా ప్ర యుక్త రాష్ట్రాలు ఏర్పడ్డా యని మన తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని, అనేక జాతులు భాషలు కలవారు తమ భాషను తమ రాష్ట్రా లలో స్పష్టంగా అమలు చేస్తున్నారని స్వాతంత్రం వచ్చిన తరు వాత భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ను రాష్ట్ర ప్రభు త్వాలకు అప్పగించారని ఆ దిశగా మాతృభాష ప్రాచుర్యానికి చర్యలు చేపట్టాల్సిన అవ సరాన్ని గుర్తు చేశారు. తీర్మానాలనేవి అందరి అంగీకారంతో తెలుగు మాధ్యమం ప్రాచుర్యానికి అనుగుణంగా నిబద్ధతతో తీర్మానించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్బంధంగా కన్నడ భాషను కర్ణాటకలో బోధిస్తున్నారని అదేవిధం గా మనకు తెలుగు భాషలో విద్యాబోధన డిగ్రీ స్థాయి వరకు జరగాల్సిన అవ సరం ఉందన్నారు పోరా టమే జీవితం అవుతుం దని ఆచరణ లోనికి రావడం లేదన్నారు. తెలు గు భాష పై ఉన్న మక్కు వతో దివిసీమ నుండి కోనసీమకు ఆహ్వానం మేరకు వచ్చి పాల్గొనడం జరిగిందన్నారు ఆస్ట్రేలి యాలో తెలుగు వారు తెలుగు ప్రాంతం నుండి రచయితలను తీసుకుని వెళ్లి పద్యాలు రచించి తెలుగు అభిరుచులు నిలబెట్టే చేయడం అభి నందనీ యమన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు తాము తెలుగువారిమని చెబితే ఇబ్బందులు ఎదురవు తాయనే భావన కలిగి ఉన్నారన్నారు ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో ఉండే తెలుగు భాష నేడు నాలుగో స్థానానికి చేరుకుం దన్నారు. మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ మాట్లాడుతూ తెలుగు భాష కేవలం సం భాషణ మాత్రమే కాదని మన సంస్కృతి వారసత్వా న్ని ముందుకు తీసుకెళ్లే మాతృ భాష అన్నారు మన కలలను సాంప్రదా యాలను కుటుంబ బం ధాలను విలువలను కాపాడుతుందన్నారు వేల సంవత్సరాల సంపదను కళలను మున్ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవ సరం ఉందన్నారు మాతృ భాష వ్యాప్తి పట్ల అందరూ ఏకత్వంతో నిలిస్తే సమా జం కూడా నిలుస్తుందన్నా రు అనేకమంది మహనీ యులు తమ జీవితాన్ని అంకితం చేసి తెలుగు సాహిత్యానికి పట్టం కట్టారన్నారు. మహాకవి గురజాడ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మన సులోయి అన్న సూక్తులు నేటికీ సగర్వంగా నిలుస్తా యిన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి స్వర్గీయ ఎన్టీ రామారావు నినం దించారన్నారు అదేవి ధంగా తెలుగు భాషకు ప్రాచుర్యం సంకల్పించేలా స్వర్గీయ రామోజీరావు కృషి చేశారన్నారు. తెలుగు భాష మూలాలు దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తూ మాతృభాష కు ఉన్న గౌరవాన్ని కాపాడా లన్నారు. డి ఆర్ డి ఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రస్తుతం సాంకేతిక యుగంలో తెలుగు భాష వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని డిజిటల్ వేదికలు, ఆన్‌లైన్ విద్య, ఈ-పుస్తకాలు, అనువాద సాఫ్ట్‌వేర్‌లు ద్వారా తెలుగు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాల న్నారు కలిసి పనిచేస్తే తెలుగు భాషను భవిష్యత్ తరాలకు మరింత బలంగా అందించగలమన్నారు
మన సంస్కృతి సాంప్ర దాయాలు, నృత్యాలు, సంగీతం, జానపద కళలు ప్రపం చానికి తెలుగు వైభవాన్ని తెలియజేస్తు న్నాయన్నారు. ఈ మహాసభలు ఆ సంప్ర దాయాల ప్రదర్శనకు, సాహిత్య చర్చలకు, పరిశోధనలకు, యువతలో చైతన్యం కలిగించేందుకు ఒక ఉత్తమ వేదికగా నిలు స్తాయని నమ్ము తున్నా నన్నారు ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహి స్తున్న నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినం దనలు తెలియజేస్తూ, ప్రపంచ తెలుగు సమాజం మరింత ఐక్యంగా, సృజనా త్మకంగా ఎదగాలని ఆకాం క్షిస్తున్నానన్నారు. చైతన్య రాజు ప్రసంగిస్తూ ఈ సభల ద్వారా ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో విద్యను భ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాల కల్పనలో 10 శాతం రాయితీ కల్పిం చాలని, రెండవది ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు మాతృభాషను బోధిం చాలని తీర్మానించామ న్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత తనికెళ్ల భరణి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు స్థానిక శాసనసభ్యులు ఆనందరావు కె రవి కిరణ్ వర్మ కె శశి వర్మ నిర్వాహకులు పాల్గొన్నారు.



