ANDHRA PRADESHBREAKING NEWSWORLD

పోలెండ్ అమ్మాయి రేపల్లె అబ్బాయి

మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు

పోలెండ్ అమ్మాయి రేపల్లె అబ్బాయి

మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు

రేపల్లె ఫిబ్రవరి 25 యువతరం న్యూస్:

రేపల్లె యువకుడు జగదీష్ సాన్నిహిత్యంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మన వివాహ వ్యవస్థకు ఆకర్షితురాలై పోలెండ్ కు చెందిన లినా రేపల్లె పట్టణం ఇసుకపల్లి 18 వ వార్డుకు చెందిన కాట్రగడ్డ శ్రీపతి – పద్మజ దంపతుల కుమారుడు జగదీష్ ను వివాహమాడింది. స్థానిక వీరవల్లి కోటయ్య కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం మూడు ముళ్ళు, ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. వధువు లినా తల్లిదండ్రులు ఆర్ మారక్- దొరోటా కారణాంతరాల వల్ల రాలేకపోవటంతో రావెళ్ల సురేష్ బాబు-స్వప్న దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. వివాహ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్, సిటీ కేబుల్ అధినేత మాగంటి సాంబశివరావు, స్థానిక నేతలు కె అగస్త్య, ధర్మ తేజ తదితరులు పాల్గొని ఆశీర్వదించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!