ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS

కలుగొట్ల 2 (బుక్కాపురం) సచివాలయం కు తాళం 

కలుగొట్ల 2 (బుక్కాపురం) సచివాలయం ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు 

కలుగొట్ల 2 (బుక్కాపురం) సచివాలయం కు తాళం

గ్రామస్తుల నిరాశ

వెల్దుర్తి ఫిబ్రవరి 16 యువతరం న్యూస్:

వెల్దుర్తి మండలంలోని కలుగొట్ల  (బుక్కాపురం) గ్రామ సచివాలయం సోమవారం మధ్యాహ్నం వరకు మూసివేయబడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి పలు పనుల కోసం వచ్చిన గ్రామస్తులు మధ్యాహ్నం 12 గంటలు దాటినా కార్యాలయం తలుపులు తెరవకపోవడంతో నిరాశకు గురయ్యారు.
ఇతర సంక్షేమ పథకాల సమాచారానికి వచ్చిన పలువురు కొంతసేపు వేచి చూసి వెనుదిరిగారు.

ఈ విషయమై ఎంపీడీవో సుహాసినమ్మను సంప్రదించగా, సిబ్బంది సమయపాలనపై ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చినట్టు తెలిపారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.

గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!