ANDHRA PRADESHCRIME NEWS

కోడుమూరులో సినీ పక్కిలో నగదు చోరీ

కోడుమూరులో సినీ పక్కిలో నగదు చోరీ

కోడుమూరు జనవరి 13 యువతరం న్యూస్:

సోమవారం నాడు కోడుమూరు పట్టణంలో సినీ పక్కిలో నగదును కొంతమంది దోచుకున్నట్టు , దోచుకున్న దుండగులు ఒకరు హెల్మెట్ ధరించారని, ఇంకొకరు మొహానికి మాస్క్ ధరించారని తమ వెంట తెచ్చుకున్న మోటార్ సైకిల్ పై పరారయ్యారని బాధితుడు తెలియజేశాడు. కోడుమూరు పట్టణంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ముందు తన ద్విచక్ర వాహనంలో అప్పటికే రెండు లక్షల రూపాయల నగదును ఉంచినట్టు , అది కూడా బంగారు ను తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులు అని వ్యక్తిగత పనుల నిమిత్తం బ్యాంకు లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి తన స్నేహితుడి ముందే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన బైక్ లో ఉన్న నగదును తస్కరించినట్టు బాధితుడు పీ.కాసిం వలి తెలిపాడు. ఈ విషయంపై కోడుమూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలుపగా పోలీసులు వెంటనే స్పందించి బ్యాంకు మరియు పాత బస్టాండు పరిధిలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అనంతరం రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు బాధితుడు పి .కాసిం వలి తెలిపాడు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!