కోడుమూరు శ్రీ చౌడేశ్వరి దేవి తిరుణాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

కోడుమూరు శ్రీ చౌడేశ్వరి దేవి తిరుణాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
ఉత్సవ కమిటీ
కోడుమూరు డిసెంబర్ 12 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లాలో పేరుగాంచిన కోడుమూరు శ్రీ చౌడేశ్వరి దేవి తిరుణాల మహోత్సవ కార్యక్రమములను మరియు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోడుమూరు శ్రీ చౌడేశ్వరి దేవి క్రీడా ఉత్సవ కమిటీ నిర్ణయించుకుంది. కోడుమూరులో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్లకు దాదాపు శతాబ్ద కాలం చరిత్ర ఉన్నట్టు పెద్దలు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల రథోత్సవ కార్యక్రమం జరగడం ఇక్కడ విశేషం. మళ్లీ అటువంటి గొప్ప చరిత్ర కలిగిన కార్యక్రమమును ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయనిర్వహకులు తెలిపారు. ఫిబ్రవరి 2 నా రథోత్సవం ఫిబ్రవరి 3న తిరుగు రథోత్సవం ఉంటుంది. ఈ సందర్భంలో ప్రజలకు మరియు బంధువులకు క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు కోడుమూరు ఉత్సవ కమిటీ ముందుకు వచ్చి పట్టణంలో శనివారం నుంచి చందాలు వసూలు చేస్తూ పట్టణ ప్రజలను శ్రీ చౌడేశ్వరి దేవి భక్తులను ఉత్సాహపరుస్తున్నారు. కోడుమూరు పట్టణంలోని ప్రముఖులకు మరియు వ్యాపారవేత్తలు ప్రజలు అందరూ ఈ వేడుకలకు అయ్యే ఖర్చులకు తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులను ఉత్తేజ పరుస్తున్నారు ప్రజలు. ఈ కార్యక్రమంలో క్రీడా ఉత్సవ కమిటీ సభ్యులు లాయర్ ప్రభాకర్ , హుస్సేన్ అప్ప స్వామి , తెలుగు వీరన్న , రంగస్వామి, డాక్టర్ షాకీర్ భాష , నాగేశ్వరరావు , ఏకాంబరం , జయన్న , దయాకర్, తదితరులు పాల్గొన్నారు.



