ANDHRA PRADESHCORRUPTION

ప్రభుత్వ అనుమతి ఒకటే…

వీధి ఒకటి వెలుగు చూస్తున్న అక్రమ మద్యం దుకాణాలు

ప్రభుత్వ అనుమతి ఒకటే…

అమడగూరులో రెండు మద్యం,దుకాణాలు!

ఎక్సైజ్ శాఖ మౌనం వెనుక మర్మం ఏమిటి

అమడగూరు
జనవరి 08 యువతరం న్యూస్:

అమడగూరు మండలంలో మద్యం వ్యాపారం అక్రమం కాదు…ఇది కొంతమంది నాయకులు,రక్షణతో నడుస్తున్న మద్యం మాఫియా వ్యవస్థగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం టెండర్ల ద్వారా మండల కేంద్రానికి కేవలం ఒక్క వైన్స్ షాప్‌కే అనుమతి ఇచ్చింది.ఈ టెండర్లలో అధికార పార్టీ కి చెందిన నాయకునికి రావడంతో ఆయన సిండికెట్ ద్వారా అ పార్టీ కి చెందిన నలుగురు వ్యక్తులు భాగస్వాములు అయ్యరు. మొదట లాభాలు రావడం లేదన్న సాకుతో, రెండు మద్యం దుకాణాలు బహిరంగంగానే నడుపుతున్నారు,
ఈ అక్రమ షాప్ వెనుక కీలక నేతలు అండ ఉందన్న ఆరోపణలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు,అన్నీ పక్కన పెట్టి, తన రాజకీయ పలుకుబడితో మహమ్మదాబాద్ పబ్లిక్ ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ జేబుల్లోకి మళ్లుతుండటమే కాదు, పాలన వ్యవస్థకే సవాల్‌గా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

గ్రామాలన్నీ నాయకుల,అండతో నడిచే బెల్ట్ షాపులే….

మండలంలోని పలు గ్రామాల్లో రెండు నుంచి మూడు వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.వాటికి మద్యం సరఫరా చేస్తున్నది ఎవరో కాదు… అధికారిక వైన్స్ షాప్ నిర్వాహకులే.
ఈ వ్యవస్థ అంతా నాయకుల ఆశీస్సులతోనే నడుస్తోందన్న ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.
వ్యసనం రాజకీయానికి పెట్టుబడి?
బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయించి, మందుబాబుల వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల అక్రమ ఆదాయం సృష్టిస్తున్నారని ప్రజలు అంటున్నారు.అంతేకాదు మద్యం దుకాణం దగ్గర మద్యం తాగాలంటే రూమ్ కి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలి. అయితే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా మద్యం బాబులు మందు తాగడానికి మద్యం దుకాణం ముందే బండ్లు వేసి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ సొమ్ము రాజకీయ కార్యకలాపాలకు పెట్టుబడిగా మారుతోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి
అమడగూరు వైన్స్ షాప్‌లో అధిక ధరలకు, విక్రయిస్తున్నారు,ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి.ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే లాభాలు, రాజకీయ ప్రయోజనాలేముఖ్యమైపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయన్నారు.
ఎక్సైజ్ శాఖ ఎవరికి పనిచేస్తోంది?
ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు.
ప్రజల్లో ఉన్న సందేహం ఒక్కటే —
“ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికా? లేక నాయకులకు
ప్రతి నెల అక్రమ వైన్స్ షాప్ నుంచి ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు బహిరంగంగా మాట్లాడుతున్నారు.
కర్ణాటకకు పారుతున్న మందుబాబులు – పాలన వైఫల్యానికి నిదర్శనం
అధిక ధరలు, భయంతో అమడగూరు ప్రజలు నాణ్యత లోపాల వల్ల, కర్ణాటకకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇది కేవలం మద్యం సమస్య కాదు
ప్రజల ప్రశ్నలు – సమాధానం ఎవరిది?…

నాయకులు,అండ లేకుండా అక్రమ షాప్ ఎలా నడుస్తుంది?
బెల్ట్ షాపులపై ఎందుకు చర్యలు లేవు?ఎక్సైజ్ అధికారుల మౌనానికి కారణమేంటి?రాజకీయ బాధ్యత తీసుకుంటారా?
బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ వైన్స్ షాపులను వెంటనే మూసివేయాలని,
రాజకీయ అండ ఇచ్చిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!