యువత క్రీడల పట్ల మక్కువ కలిగి ఉండాలి
చర్ల చెర్రీ 11 టీం జెర్సీలను ఆవిష్కరించిన సిఐ రాజు వర్మ

యువత క్రీడల పట్ల మక్కువ కలిగి ఉండాలి
చర్ల చెర్రీ 11 టీం జెర్సీలను ఆవిష్కరించిన సిఐ రాజు వర్మ
ములుగు ప్రతినిధి జనవరి 6 యువతరం న్యూస్:
చర్ల ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న చర్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో సోమవారం జరిగిన మ్యాచ్ లో పోలీస్ 11 పై చెర్రీ 11, జట్టు భారీ విజయం సాధించింది, ముందుగా బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 10,ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 70/9 చేసింది, 71,పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెర్రీ 11 జట్టు కేవలం 5.3 బాల్స్ లో కొట్టి విజయం సాధింధిచింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన చెర్రీ 11 జట్టు ప్లేయర్ గోవింద్ పాండ్యా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించించి,
చెర్రీ 11 టీమ్ జెర్సీలు ఆవిష్కరణ
ముందుగా చెర్రీ టీమ్ జెర్సీలను ఆవిష్కరించిన సీఐ రాజు వర్మ. ఈ సందర్భంగా మాట్లాడుతూ,, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడాల పట్ల మక్కువ కలిగి ఉండాలన్నారు. నాలుగు మండలాల నుంచి వస్తున్న ప్రతి క్రీడాకారుడు తమ అద్భుత ప్రతిభ కనబరిచి మరింత ఎత్తుకు క్రీడల్లో ఎదగాలని తెలిపారు,
ఈ కార్యక్రమంలో సిపిఎల్ మేనేజ్మెంట్ ఆలం సతీష్, సంతోష్ రెడ్డి, పూజారి సతీష్, కాకి అనిల్, ఆలం ఈశ్వర్, పంజా రాజు, రామగిరి అరుణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.



