ANDHRA PRADESHEDUCATIONOFFICIALSTATE NEWS

సంక్షేమ వసతి గృహాలు చక్కగా పనిచేయాలి

ఎస్.సత్య నారాయణ, బి.సి.వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి

సంక్షేమ వసతి గృహాలు చక్కగా పనిచేయాలి

విద్యార్థుల చదువు-ఆరోగ్యం పై శ్రద్ద పెట్టండి

100 శాతం ఉత్తీర్ణత సాధించాలి

సిబ్బంది ఉద్యోగం చేసే ప్రదేశం లో నివాసం ఉండాలి

ఎస్.సత్య నారాయణ, బి.సి.వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి

కర్నూలు ప్రతినిధి జనవరి 06 యువతరం న్యూస్:

సంక్షేమ వసతి గృహాలు చక్కగా పనిచేయాలి అని విద్యార్థుల చదువు , ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని బి.సి.వెల్ఫేర్ శాఖ ఎక్స్-అఫీషియో కార్యదర్శి ఎస్.సత్య నారాయణ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం సునయన ఆడిటోరియం లో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల హెచ్‌డబ్ల్యూఓలు, ఏబీసీడబ్ల్యూఓలు, డీబీసీడబ్ల్యూఈఓలు మరియు ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్సిపాళ్ల అవగాహనా కార్యక్రమాన్ని బి.సి.వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి నిర్వహించారు. ఈ సందర్బంగా సెక్రటరీ మాట్లాడుతూ…సంక్షేమ వసతి గృహాలు ముఖ్యమంత్రి ఆశించిన విధంగా చక్కగా పనిచేయాలన్నారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని, మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. స్టడీ అవర్స్ ను 100 రోజులు పూర్తిగా వినియోగించుకొని, వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది ఉద్యోగం చేసే ప్రదేశం లో నివాసం ఉండాలన్నారు. పేరెంట్స్, టీచర్స్, వార్డెన్స్ తో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, విద్యార్థులకు సమస్యలు లేకుండా పరిష్కరించాలని సెక్రెటరీ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించాలని , మెడికల్ సీట్లు సాధించాలని, ఆ మేరకు విద్యార్థులను ప్రిపేర్ చేయాలని, క్రీడల విషయంలో ప్రోత్సాహకాలు అందించాలని ఆదేశించారు. ఐ వి ఆర్ ఎస్ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా పని చేయాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పాజిటివ్ పబ్లిక్ పెర్ఫార్మెన్స్ రిపోర్టులో నాలుగు జిల్లాలు మంచి స్థానం సాధించాలని ఆదేశించారు . ఉత్తీర్ణతలో 100% సాధించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న మౌలిక వసతులు మరియు విద్యార్థుల పెర్ఫార్మెన్స్ పై వార్డెన్ ల తో విచారించారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతము ఎక్కువ సాధించిన వార్డెన్లతో వారు చేస్తున్న విధానాలు అడిగి తెలుసుకుని, మిగిలిన వారు కూడా ఆ విధంగా చేయాలని ఆదేశించారు. సీ- గ్రేడ్ లో ఉన్న విద్యార్థులను ఏ- గ్రేడ్ కి తీసుకొని రావాలని ఆదేశించారు. హాస్టల్ లో దోమలు రాకుండా మరియు మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహాత్మ జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ హాస్టల్స్ సెక్రటరీ మాధవి లత మాట్లాడుతూ… మీ పరిధిలోని హాస్టల్లో అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, మంచి ఆహారం అందించాలని , పరిశుభ్రంగా ఉండే చర్యలు చేపట్టాలని , క్రింది స్థాయిలో ఉన్న విద్యార్థులను బాగా చదివేలాగా చర్యలు తీసుకోవాలని , పదవ తరగతి ఇంటర్మీడియట్ లలో 100% ఉత్తీర్ణత సాధించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… నాలుగు జిల్లాలలో ఉత్తీర్ణత శాతం బాగా పెరగాలని , అధికారులు పిల్లల చదువుకునే సమయంలో వసతి గృహాలలో పర్యవేక్షణ జరపాలని, వారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు సైక్రియాటిస్ట్ సలీం భాష విద్యార్థులకు విద్యపై ఆసక్తి కలిగించే చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయాలపై అవగాహన కల్పించారు.
సమావేశంలో జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి , నాలుగు జిల్లాల బీసీ వెల్ఫేర్ అధికారులు ప్రసూన కర్నూలు , కుష్బూ కొఠారి అనంతపురం , జగ్గయ్య నంద్యాల , రాజేంద్ర కుమార్ రెడ్డి సత్యసాయి , మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపాల్ లు , సహాయ బీసీ వెల్ఫేర్ అధికారులు , వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!