కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ ఎన్. చిన్న రాయుడుకు ఆంధ్ర సరస్వత పరిషత్ అవార్డు, సత్కారం

కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ ఎన్. చిన్న రాయుడుకు ఆంధ్ర సరస్వత పరిషత్ అవార్డు, సత్కారం
కర్నూలు ప్రతినిధి జనవరి 6 యువతరం న్యూస్:
తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు చేసిన సేవలకు గుర్తింపుగా కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడుకు ఆంధ్ర సరస్వత పరిషత్ అవార్డు లభించింది. ఆంధ్ర సరస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026లో భాగంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మేనేజర్‌కు అవార్డును ప్రదానం చేశారు. తెలుగు భాష అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ, సాహిత్య ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేసినందుకుగాను ఈ అవార్డును అందజేశామని ఆంధ్ర సరస్వత పరిషత్ ప్రతినిధులు, నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో నగరపాలక సంస్థ కార్యాలయంలో సంతకాలు, తపాలా నివేదికలు, అధికారిక లేఖలు తదితరాలను మేనేజర్ యన్.చిన్నరాముడు పూర్తిగా తెలుగులోనే రూపొందిస్తారని తెలిపారు. ఇది ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ మాతృభాష పట్ల అవగాహనను పెంపొందిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఆయనకు సహచర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.



