ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా

కర్నూలు ప్రతినిధి జనవరి 6 యువతరం న్యూస్:

విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు డిఐజి , కర్నూల్ జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిఐజి , కర్నూల్ జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
వాహనాల తనిఖీలు.
అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
సైబర్ నేరాలపై అవగాహన.
ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. రహదారి భద్రత నిబంధనలు.
రహదారి భద్రతపై అవగాహన కల్పించడం , ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు. రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై చర్యలు. మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
ప్రజలు భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే స్ధానిక పోలీసులకు గాని, డయల్ 112 కు గాని లేదా డయల్ 100 గాని సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!