EDUCATIONOFFICIALTELANGANA

మండల స్థాయి ఆంగ్ల ప్రతిభా పోటీలు

మండల స్థాయి ఆంగ్ల ప్రతిభా పోటీలు

ములుగు ప్రతినిధి జనవరి 2 యువతరం న్యూస్:

వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారంలో ఇంగ్లీషు భాషా టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా)ఆధ్వర్యంలో మండల స్థాయి ఆంగ్ల ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించనైనది,
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు,ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల విభాగంలో సీనియర్స్ ‘జూనియర్స్ కేటగిరీలో పోటీలు ఒలంపియాడ్ రాత పరీక్ష,ఉపన్యాస పోటీలు నిర్వహించగా మండలం నుండి 8 మంది విద్యార్థినీ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు,
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో సీనియర్స్ కేటగిరీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆర్.లోకేష్,సిహెచ్.మహేష్,జూనియర్స్ కేటగిరీలో ఎ.బిల్వనాథ్, ఎన్.నిశిత,ఆశ్రమ ఉన్నత పాఠశాలల విభాగంలో సీనియర్ కేటగిరీలో జూనియర్ కేటగిరీలో పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బి.జ్యోత్స్న, బి. లక్ష్మి వినిత,టి.జాహ్నవి, యు.అక్షర లు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు,పోటీలలో జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు అభినందించారు, కార్యక్రమంలో పోరిక స్వరూప్ సింగ్,ఆంగ్ల ఉపాధ్యాయులు చల్లగురుగుల మల్లయ్య, బుచ్చిబాబు,నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!