ప్రతి రైతు మొహంలో ఆనందం కనిపించాలి
రెవిన్యూ రీ సర్వేలో భాగంగా ఆమడగూరు మండలంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి


ప్రతి రైతు మొహంలో ఆనందం కనిపించాలి
ఆస్తి విషయాల్లో కుటుంబాల మధ్య బంధాలు దూరం కాకుండా అపగలిగే శక్తి ఒక్క రెవిన్యూ అధికారులకు మాత్రమే.
రైతులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించండి
పుట్టపర్తి నియోజవర్గం లో ఎక్కడా రెవిన్యూ సమస్యలు ఉండకూడదు.
రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం
పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి.
రెవిన్యూ రీ సర్వేలో భాగంగా ఆమడగూరు మండలంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
ఆమడగూరు జనవరి 02 యువతరం న్యూస్:
ప్రతి రైతు మొహాల్లో ఆనందం కనిపించేలా ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. ఆమడగూరు మండలం చీకిరేవులపల్లిలో రీ సర్వేలో భాగంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడారు. ఆస్తి విషయాల్లో కొన్ని కుటుంబాల మధ్య బంధాలు తగ్గిపోయి కుటుంబానికి పూర్తిగా దూరమైపోతున్నాయని ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటినీ పూర్తిగా అరికట్టే బాధ్యత రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడా రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలని అందుకు రెవిన్యూ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో పారదర్శకంగా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరి ఆస్తి వారికే హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తూ ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకం రైతులకు అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో ప్రతి రైతు పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటోను ముద్రించి ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ల్యాండ్ టైటిల్ యాక్టు తీసుకొచ్చి ఆస్తులకు భద్రత లేకుండా చేసే ప్రయత్నం చేయడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ జగన్ ప్రభుత్వం అలాగే ముందుకు పోయిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తీసుకొచ్చిన టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రెండో సంతకంతో వాటిని రద్దు చేశారని గుర్తు చేశారు .ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకు సంబంధించిన ఆస్తులు వారికే చెందే విధంగా ప్రభుత్వం నూతన పాస్ పుస్తకాల్లో ఎలాంటి ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్ర తో వీటిని మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. ఎవరి భూమి వారికే హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం నిజమైన రైతులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. 2026లో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలని నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.క్షేత్రస్థాయిలో రెవిన్యూ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టకుండా తక్షణం ఆ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ వివాదాలకు స్వస్తి పలకాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రెవెన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రీ సర్వేలో భాగంగా రైతులకు వారికి హక్కు కలిగిన భూములను ఇచ్చే విధంగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేస్తుందని తెలిపారు. ఎక్కడ చూసినా ఆస్తి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని వాటికి రెవిన్యూ అధికారులు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా త్వరలోనే 22a లో ఉన్న భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని తెలిపారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు 22,అధికారం ఉండేదని ప్రస్తుతం ఆర్డీఓ లకు ఈ అధికారం కల్పిస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ ఆస్తితగాదాలు రెవిన్యూ సమస్యలు లేకుండా చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా రైతులతో అర్జీలు స్వీకరించారు. అనంతరం నూతన పాస్ పుస్తకాలను రైతులకు వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమడగూరు సహకార సొసైటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి ,మండల ఇన్చార్జి తాహసిల్దార్ మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర డైరెక్టర్ కాలేనాయక్ , రైతు సంఘం జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి , కొత్తచెరువు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నంజప్ప ,టిడిపి యువ నాయకులు శ్యాంబాబు టిడిపి నాయకులు వెంకట రెడ్డి, బిజెపి కార్యవర్గ సభ్యులు సుబ్బిరెడ్డి,ఎల్ఐసి నరసింహులు , పెద్దక భాస్కర్ రెడ్డి, డి,కృష్ణారెడ్డి, ఈ న్యుట్ ఇంచార్జ్,కుమార్ రెడ్డి , యువ నాయకుడు,నాగేంద్ర రెడ్డి, రాజు భాస్కర్ రెడ్డి,కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



