బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

బంగ్లాదేశ్ దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
నాగర్ కర్నూల్ ప్రతినిధి డిసెంబర్ 27 యువతరం న్యూస్:
బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడులకు నిరసిస్తూ లింగాల మండలం రాయవరం గ్రామంలో గురువారం రాత్రి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ ముర్దాబాద్ అంటూ స్లోగాన్లు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల జరుగుతున్న వరుస దాడులను ముక్తకంఠంతో ఖండించారు. హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని ఐక్యంగా ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు సంగిశెట్టి శేఖర్, రాయవరం గ్రామ సభ వార్డు మెంబర్లు శంకర్ మోహన్, గ్రామస్తులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, శివనందన్, శ్రీను, మహేష్, మోహన్, కృష్ణ, నర్సింహా, ఈశ్వరయ్య, శంకర్, రాజు, మహేష్, పవన్, సైదులు రైతులు శాంతయ్య, పాల్య, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.



