ANDHRA PRADESHCRIME NEWSOFFICIALSTATE NEWS

మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ చేయించిన ఈగల్ టీం , కర్నూలు పోలీసులు

మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ చేయించిన ఈగల్ టీం , కర్నూలు పోలీసులు

కర్నూల్ క్రైమ్ డిసెంబర్ 24 యువతరం న్యూస్:

కర్నూలు పట్టణంలో గంజాయి సేవిస్తూ, మత్తుకు అలవాటుపడి పట్టుబడ్డ 5 మంది వ్యక్తులకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ,కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న డీ – అడిక్షన్ సెంటర్ లో ఈగల్ టీం, కర్నూలు పోలీసులు కలిసి కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ చేయించారు. యువకులు సత్ ప్రవర్తన మార్గంలో నడుచుకునే విధంగా కౌన్సిలింగ్ చేసారు. గంజాయి సేవిస్తూ ఉండడం పై ఆ పిల్లల తల్లిదండ్రులు 1972 కి సమాచారం అందించారు.
ఎవరైనా డ్రగ్స్, గంజాయి సేవిస్తున్నట్టు తెలిస్తే ఈగల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్ కు సమాచారం అందించాలని కర్నూలు పోలీసులు తెలిపారు. విక్రయించినా, సేవించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కొన్ని హాట్ స్పాట్స్ ను గుర్తించి 200 వరకు కర్నూలు లోని మెడికల్ కళాశాలలు , ఇంజనీరింగ్ కళాశాలలు, విద్యా సంస్ధలు, డిగ్రీ , ఇంటర్మీడియట్ కళాశాలలో ఈగల్ టీం మరియు కర్నూలు పోలీసులు కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కర్నూలులో 500 మందితో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్దులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, భవిష్యత్తులో ఏవిధంగా వారి జీవితాలు పాడవుతాయనే అంశంపై , తల్లిదండ్రులు కష్టపడి చదివించి గొప్పవాళ్ళను చేయాలనుకున్న ఆశలు అడియాశలవుతున్నాయని,వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఎస్సై సుజన్ కుమార్ , ఈగల్ టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!