రైతులకు పోలీస్ అధికారులు న్యాయం చేయాలి
కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి

రైతులకు పోలీస్ అధికారులు న్యాయం చేయాలి
కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి
లింగాల నవంబర్ 8 యువతరం న్యూస్:
వరుస కేబుల్ దొంగతనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులకు పోలీస్ అధికారులు న్యాయం చేయాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి శనివారం ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మండల వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రైతుల మోటార్లు,స్టార్టర్లు,కేబులు చోరీకి గురవుతున్నాయి అన్నారు. ఒకేరోజు 40 మంది రైతులకు చోరీకి గురై మండల వ్యాప్తంగా రైతులకు తీవ్రనష్టం కలిగించింది అన్నారు. ప్రస్తుతo ఏ పంటకు గిరాకీ ధర లేదని అలాంటి సమయంలో రైతులకు ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత దురదృష్టకరం అన్నారు. పోలీసులు నిందితులను పట్టుకొని చోరీకి గురైన కేబుల్ లను రికవరీ చేయాలన్నారు. కేబుల్ లను దొంగతనం చేసిన దొంగల నుంచి కేబుల్ లను కొనుగోలు చేసిన వారిని సైతం నిందితులుగా చేర్చాలన్నారు. ఈ సంఘటనలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైసిపి మండల కన్వీనర్ బాబు రెడ్డి పాల్గొన్నారు.



