ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది


ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది
దేవరకద్ర నవంబర్ 4 యువతరం న్యూస్:
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మహబూబ్ నగర్ డీఈవో ప్రవీణ్ కుమార్, నారాయణపేట డిఇఓ గోవిందరాజులు అన్నారు. మంగళవారం దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు వెంకటయ్య సన్మాన కార్యక్రమాన్ని దేవరకద్ర శ్రీనివాస గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైందన్నారు. ఒక ఉపాధ్యాయుడికి నిస్వార్థంతో విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపే శక్తి ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో గౌరవప్రదమైందన్నారు. గత కోనేరుగా పాఠశాలలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడుని చూసి విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడిని ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.



