బీసీ రిజర్వేషన్లపై అగ్రకులాల కుట్ర

బీసీ రిజర్వేషన్లపై అగ్రకులాల కుట్ర
42 శాతం కోటా పరిరక్షణకు బీసీలు ఏకం కావాలి!
కోర్టు స్టే బాధాకరం
బీసీల పొట్ట కొట్టొద్దు
బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షుడు జనగం కేశవరావు
ములుగు ప్రతినిధి అక్టోబర్ 11 యువతరం న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేందుకు అగ్రకులాల కుట్ర జరుగుతోందని బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు జనగం కేశవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, రాష్ట్ర జనాభాలో దాదాపు 60% ఉన్న బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు ఉద్దేశించిన 42 శాతం రిజర్వేషన్ల సాధనను అడ్డుకోవడం పచ్చి దుర్మార్గం అని ధ్వజమెత్తారు,42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం వెనుక ఓర్వలేని కొంతమంది కుట్రదారులు ఉన్నారని, ఇది బీసీల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు,
గతంలో అగ్రకులాల కోసం ఈడబ్ల్యూఎస్ (ఈ డబ్ల్యు ఎస్) రిజర్వేషన్లు తెచ్చినప్పుడు ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు, బీసీలలోని పేదలకు మేలు చేసే రిజర్వేషన్లను అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు,తెలంగాణ ఉద్యమంతో సహా ఎన్నో పోరాటాల్లో ముందున్న బీసీలు నేడు తమ హక్కుల కోసం మళ్లీ ఉద్యమించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు,రిజర్వేషన్లను అడ్డుకునే ఈ కుట్రను ప్రతి ఒక్క బీసీ నాయకుడు ముక్తకంఠంతో ఖండించాలి జనగం కేశవరావు పిలుపునిచ్చారు,బీసీ ప్రజలంతా వెంటనే చైతన్యమై, రిజర్వేషన్ల సాధన కోసం సమిష్టిగా, ఉక్కు సంకల్పంతో ఐక్య పోరాటాలు చేయాలి, అవసరమైతే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి, బీసీ ఉద్యమాన్ని మిన్నంటేలా ఉదృతం చేయాలి,ఇది కేవలం రిజర్వేషన్ల సమస్య కాదు, ఇది బీసీల ఆత్మగౌరవం, మనుగడకు సంబంధించిన పోరాటం అని బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షుడు జనగం కేశవరావు అన్నారు.