హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ కు ఘన సన్మానం

హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ కు ఘన సన్మానం
వెల్దుర్తి జూన్ 2 యువతరం న్యూస్:
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ ఓర్వకల్లు పోలీస్ స్టేషన్కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయనను ఎస్ఐ అశోక్ రిలీవ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ ను శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం అన్నారు. హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ గత కొన్ని సంవత్సరంలుగా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శివరామ కృష్ణారెడ్డి, బాలకృష్ణ, కానిస్టేబుల్ ప్రసాద్, మునిశేఖర్, దానం, దస్తగిరి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు