అక్రమ కేసులను ఎత్తివేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

అక్రమ కేసులను ఎత్తివేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ములుగు ప్రతినిధి ఏప్రిల్ 5 యువతరం న్యూస్:
భద్రాచలం పట్టణంలోని కుంజా ధర్మా ఇంటి వద్ద జరిగిన ప్రెస్ మీట్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాపురం బీజేపీ మండల అధ్యక్షులు రాజశేఖర్,పై నాటకీయంగా జరిగిన కుట్ర పరిణామాలు, కేసు నమోదు సంఘటనలను తీవ్రంగా ఖండించారు,అలాగే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా మాట్లాడుతూ
ఈ నెల 30న వెంకటాపురం మండలం, చిరుతపల్లి గ్రామంలో రైతుల ఆత్మహత్యలతో మొదలయిన, నకిలీ విత్తనాలకు వ్యతిరేఖంగా జరుగుతున్న పోరాటాన్ని ప్రక్కదారి పట్టించేలా, ఆ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న మా బీజేపీ నాయకుని మీద అవినీతి కాంగ్రెస్ నాయకుల అండతో, పోలీసులు కనీస విచారణ జరపకుండా, అక్రమంగా ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి పోరాటాన్ని అణగ తొక్కే ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు,ఈ సందర్భంగా ఆదివాసీ రైతుల ఆత్మహత్యల సంఘటనపై విచారణకు జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్,విచ్చేస్తున్న సందర్భంగా ముందే సదరు నాయకులు పోరాటాన్ని నీరు కార్చి, నకిలీ విత్తనాలను అమ్మే వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు,
కావునా జరిగిన సంఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, రాజశేఖర్ పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని, రైతులకు ఎక్స్-గ్రేషియా చెల్లించాలని, నాసిరకం విత్తనాలను అమ్మే వ్యాపారులపై, కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాలు నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి భూక్యా రవి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలచెర్వు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ నిడదవోలు నాగబాబు, మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ బీజేపీ నాయకులు కన్నెధార వరప్రసాద్, ములిశెట్టి రామ్మోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, అల్లాడి వెంకటేశ్వర్లు, పిసి కేశవ్, శ్రీనివాస్ గౌడ్, కె ముక్తేశ్వరరావు, నిఖిల్, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు.