పవిత్రత క్రమశిక్షణ దాతృత్వాల మేళవింపే రంజాన్ పండుగ ఉద్దేశం

పవిత్రత క్రమశిక్షణ దాతృత్వాల మేళవింపే రంజాన్ పండుగ ఉద్దేశం
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు
జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్
నంద్యాల కలెక్టరేట్ మార్చి 30 యువతరం న్యూస్:
పవిత్ర రంజాన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులు సుఖఃసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా లు ఆదివారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు రంజాన్ పండుగ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు, దీవెనలు అందాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పవిత్రత, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేళవింపే రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.