చేనేతలకు ఉచిత విద్యుత్తు హర్షనీయం
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు

చేనేతలకు ఉచిత విద్యుత్తు హర్షనీయం
రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు ఉచిత విద్యుత్తును మంత్రివర్గంలో ఆమోదించడం హర్షనీయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ కు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు
మంగళగిరి ప్రతినిధి మార్చి 20 యువతరం న్యూస్:
చేనేతలకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరి పట్టణంలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17వ తేదీన రాష్ట్ర మంత్రివర్గంలో చేనేతలకు ఉచిత విద్యుత్తు ఆమోదింప చేయటానికి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఎన్నికల సందర్భంగా హామీలలో భాగంగా చేనేత కార్మికులకు 200యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేయటాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్తు ఆమోదించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు అన్నారు. ఉచిత విద్యుత్తు జీవో వారం పది రోజుల్లో రానున్న సందర్భంగా ఏడి ఆఫీసుల నుండి రాష్ట్రవ్యాప్తంగా డేటా సమకూర్చుకొని చేనేత కేంద్రాలలో ఎంక్వైరీ చేయించడం ప్రారంభించారని ఆయన అన్నారు. అదేవిధంగా సొంత మగ్గం ఉన్న వారిని మగ్గాల షెడ్యూల్లో నేసే వారిని అలాగే సహకార సంఘాలలో నేసే వారిని, అడుగులు సరి చేసేవారు అచ్చులు అతికేవారు, లడ్డీలు ఎలిచేవారు, కండెలు చుట్టేవారు, రంగులు అద్దేవారు,పన్నెలు కట్టేవారు, ఉపవృత్తులు వారిని కూడా నాలుగు భాగాలుగా విభజించి ఒక డేటా తీసుకొని ఆ డేటాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడానికి అన్ని ఏడి కార్యాలయాల నుండి ఎంక్వైరీ జరుగుతుందని, కనుక ఆయా ప్రాంతాలకు అధికారులు వచ్చినప్పుడు చేనేత కార్మికులు అందరూ మీ డేటాను అధికారులకు తెలియజేసి మీయొక్క పేరుని నమోదు చేయించుకోవలసినదిగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు గజవల్లి వెంకట కృష్ణారావు, మంగళగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దొడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.