చింతపల్లి ముత్యాలమ్మ ఉత్సవ నిర్వహణ సమావేశం

చింతపల్లి ముత్యాలమ్మ ఉత్సవ నిర్వహణ సమావేశం
సమావేశానికి ఈనెల 21న అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని విన్నపం.
చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ పుష్పలత
చింతపల్లి మార్చి 19 యువతరం న్యూస్:
మన్యం వాసుల ఆరాధ్య దైవం, చింతపల్లిలో వేంచేసిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల నిర్వహణకు ఈనెల 21వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యంలో పాడేరు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవముల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవాలలో చింతపల్లి ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవములు ఒకటని, అటువంటి తీర్థమహోత్సవములు జరిపించాలని గత ఉత్సవ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం అనగా మార్చి 21వ తేదిన సాయంత్రం మూడున్నర గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడునని, కావున యావన్మంది భక్తులు, ప్రజానీకం, ఉద్యోగ సంఘం, వర్తక సంఘం, మోటారు యూనియన్, పాత్రికేయ సహోదరులు, నాయకులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె కోరారు.