అరకులో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి సహకారం అందించండి
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ని కోరిన పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు

అరకులో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి సహకారం అందించండి
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ని కోరిన పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు
అల్లూరి సీతారామరాజు ప్రతినిధి మార్చి 13 యువతరం న్యూస్:
ప్రపంచ స్థాయిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన అరకు పారిశుద్ధ్య సమస్యలతో సతమతమవుతుందని వాటి పరిష్కారానికి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ని పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు కోరారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు పారిశుద్ధ్య పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకు విన్నవించారు. విజయవాడలోని స్వచ్చంద్ర కార్పొరేషన్ కార్యాలయంలో పట్టాభిరామ్ ను దాసుబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అరకు సమస్యలపై విన్నవించారు. ముఖ్యంగా గత పదేళ్లుగా అరకు నిర్మాణంలో ఆయన చేసిన కృషిని వివరించి ప్రభుత్వ సహకారం లేక వెనకబడిపోయిన పరిస్థితులపై ఆయనకు సవివరంగా వివరించిన అనంతరం భవిష్యత్తులో మరింత మంది పర్యటకులను ఆకర్షించాలన్నా…. స్వచ్ఛ అరకును నిర్మాణం జరగాలన్న ప్రభుత్వ సహకారం అవసరమని అందులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కీలక భూమిక పోషించాల్సి ఉందని ఆయన పట్టాభిరామ్ కి
తెలిపారు. వచ్చే పర్యాటకుల కోసం గానీ వివిధ ప్రాంతాల నుంచి అరకు టౌన్షిప్ కొచ్చే గిరిజనుల కోసం గానీ ఇక్కడ ప్రజా మరుగుదొడ్లు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని దాని వలన అటు పర్యాటకులు ఇటు గిరిజనులు కూడా ఇబ్బందులు పడుతున్నారని వాటి ఏర్పాటుకు స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో పంచాయతీలకు కేటాయించి నిధులను గాని ఆర్థిక సంఘం నిధులను గాని పంచాయతీలకు రాకుండా జగన్ తన సొంత పథకాల కోసం వినియోగించడం వలన గ్రామాలలో కనీసం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అనేక దఫాలు గతంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని దాని క్లీనింగ్ కోసం స్కిడ్ టీర్ లోడర్ (మినీ జెసిబి) నీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి మంజూరు చేయాలని కోరారు. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకు పోకుండా చెత్త బుట్టలు ఏర్పాటుకు కూడా సహకారం అందించాలని ఆయన కోరారు. దీనిపై పట్టాభిరామ్ సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు దాసు బాబు తెలిపారు.