ANDHRA PRADESHCRIME NEWS
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వెల్దుర్తి మార్చి 8 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన ఎల్లమద్దయ్య (49) తన కుమారుడు ఎల్ల స్వామి తో కలిసి ద్విచక్ర వాహనంపై కర్నూలుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా చిన్నటేకూరు సమీపంలో బృందావన్ కాలేజీ దగ్గర జాతీయ రహదారి 44 పై వెనక నుండి వస్తున్న వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తండ్రి ఎల్లమద్దయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో తనయుడు ఎల్ల స్వామి బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వెల్దుర్తి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రెండు ఎస్సై ధనుంజయ తెలిపారు.